అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న కమలాహ్యారిస్

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసు నుంచి భారతీయ సంతతి పార్లమెంటు సభ్యురాలు కమలా హ్యారిస్ తప్పుకున్నారు. 2020లో జరగబోయే ఎన్నికల ప్రచారానికి తగినన్ని నిధులు లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. కాలిఫోర్నియా నుంచి పార్లమెంటుకు ప్రాతినిథ్యం వహిస్తున్న కమలా మంగళవారం ఓ కార్యకర్తకు ఫోన్ చేసిన సందర్భంలో ఈ విషయం తెలిసింది. ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజుతో ముగిస్తున్నానని, ఇందుకు చింతిస్తున్నానని 55 ఏళ్ల కమలా హ్యారిస్ మంగళవారం ఓ ట్వీట్ కూడా చేశారు. ఇంతకాలం తనకు సహకరించినందుకు కృతజ్ఞతలు అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి