కువైట్‌లో భారతీయుడికి జాక్‌పాట్‌ 

Indian Got Lottery In Kuwait - Sakshi

బిగ్‌ టికెట్‌ లాటరీలో రూ.12 కోట్లు సొంతం  

కువైట్‌ : అదృష్టం కలిసిరావడమంటే ఇదేనేమో.. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో ఉంటున్న ఓ భారతీయుడికి భారీ జాక్‌పాట్‌ తగిలింది. కేరళకు చెందిన అనిల్‌ వర్గీస్‌ తెవెరిల్‌ గత 20 ఏళ్లుగా కువైట్‌లో ఎగ్జిక్యూటివ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆన్‌లైన్‌లో ఓ లాటరీ టికెట్‌ కొనుగోలు చేశాడు. కొడుకు పుట్టిన రోజు 11/97 కావడంతో.. 11197 అనే నంబర్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్నాడు. అబుదాబి ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం తీసిన డ్రాలో ఇదే నంబర్‌కు లాటరీ తగిలింది.

ఇందులో విజేతగా నిలిచిన అనిల్‌.. 7 మిలియన్ల దిర్హామ్స్‌ (సుమారు రూ.12 కోట్లు) గెలుచుకున్నాడు. ఈ డ్రాలో 8 మంది విజేతలుగా నిలువగా, అందులో ఆరుగురు భారతీయులే కావడం విశేషం. వీళ్లందరికీ తలో 1 మిలియన్‌ దిర్హామ్స్‌(సుమారు రూ.1.8కోట్లు) దక్కాయి. ‘బిగ్‌ టికెట్‌ ద్వారా రెండోసారీ నా అదృష్టాన్ని పరీక్షించుకున్నాను. నేనే విజేతగా నిలుస్తానని అసలు ఊహించలేదు. ఇప్పటికీ నమ్మలేకపోతున్నాన’ని వర్గీస్‌ సంభ్రమాశ్చర్యాలను వ్యక్తంచేశాడు. వర్గీస్‌ తనయుడు ప్రస్తుతం కేరళలో అండర్‌–గ్రాడ్యుయేషన్‌ చదువుతున్నాడు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top