'డాక్టరే'.. అబార్షన్‌కు ఒత్తిడి తెచ్చాడు..! | Indian doctor takes her husband to court | Sakshi
Sakshi News home page

'డాక్టరే'.. అబార్షన్‌కు ఒత్తిడి తెచ్చాడు..!

Nov 23 2015 7:16 PM | Updated on Apr 4 2019 4:44 PM

'డాక్టరే'.. అబార్షన్‌కు ఒత్తిడి తెచ్చాడు..! - Sakshi

'డాక్టరే'.. అబార్షన్‌కు ఒత్తిడి తెచ్చాడు..!

ఇప్పుడు పదేళ్ళ వయసున్న ఇద్దరు ఆడ కవలలకు తల్లి అయిన ఆమె... అప్పట్లో గర్భస్రావానికి భర్త ఒత్తిడిని తిరస్కరించి కోర్టుకెక్కింది. లోయర్ కోర్టులో కేసును కొట్టివేయడంతో ఆమె హైకోర్టులో న్యాయపోరాటం కొనసాగిస్తోంది.

గర్భస్థ శిశువుకు లింగ నిర్ధార్ణణ పరీక్షలు చేయించకూడదన్న చట్టం ఉన్నప్పటికీ ఇండియాలో పరిస్థితి అదుపులోకి రావడం లేదు. కడుపులో ఉన్నది ఆడా, మగా తెలుసుకొని అబార్షన్లు చేయించేవారి సంఖ్య... చదువుకున్న వారిలోనూ పెరుగుతూనే ఉంది. నిరక్షరాస్యులు, విద్యాహీనులకు అవగాహన కల్సించాల్సిన వైద్యరంగంలోని వారే.. గర్భస్రావానికి ఒత్తిడి తెచ్చిన వైనం... హైకోర్టుకు చేరింది.

తనను వైద్యపరీక్షలు చేయించడానికి అంటూ నమ్మబలికి ఆస్పత్రికి తీసుకెళ్ళిన భర్త ఖురానా... రహస్యంగా వైద్యులను అల్ట్రా సౌండ్ పరీక్ష చేసి.. లింగ నిర్ధారణ చేయమని అడిగాడని మీటూ ఖురానా కోర్టును ఆశ్రయించింది. తన గర్భంలో ఆడ కమలలు ఉన్నారని తెలిసి గర్భ స్రావం చేయించుకొమ్మని భర్త ఒత్తిడి తెచ్చాడని కోర్టుకు  ఫిర్యాదు చేసింది. ఇప్పుడు పదేళ్ళ వయసున్న ఇద్దరు ఆడ కవలలకు తల్లి అయిన  ఆమె... అప్పట్లో గర్భస్రావాన్ని తిరస్కరించి కోర్టుకెక్కింది. అయితే లోయర్ కోర్టులో కేసును కొట్టివేయడంతో ఆమె హైకోర్టులో న్యాయపోరాటం ప్రారంభించింది.

జయపూర్ కు చెందిన మీటూ ఖురానా 2004 లో  కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరింది. అయితే అదే అదనుగా భావించిన భర్త ఖురానా వృత్తి రీత్యా వైద్యుడైనా... ఆమె కడుపులో ఉన్నది ఇద్దరు ఆడపిల్లలని తెలుసుకొని వారిని చిదిమివేసేందుకు ప్లాన్ వేశాడు.  దీంతో మీటూపై ఒత్తిడి తేవడం ప్రారంభించాడు. 39 ఏళ్ళ వయసున్న మీటూ ఖురానా కూడ  పిడియాట్రిషియన్. వైద్య వృత్తిలోనూ... పైగా పిల్లల డాక్టర్ గా ఉన్న ఆమె... గర్భ స్రావానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించలేదు. భర్త దౌర్జన్యాన్ని బహిర్గతం చేస్తూ కోర్టును ఆశ్రయించింది. అయితే అప్పట్లో కోర్టుకు చేరిన ఆమె కేసు.. ప్రస్తుతం హై కోర్టులో న్యాయ పోరాటానికి ల్యాండ్ మార్క్ లా మారింది.

అయితే మీటూ ఖురానా భర్త... కమల్ ఖురానా మాత్రం  ఆమె ఆరోపణలను కొట్టి పారేస్తున్నాడు. ఈ నేపథ్యంలో..  కేసుకు సంబంధించి అన్ని ఆధారాలూ ఉన్నప్పటికీ.. నిందితుడు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని.. ఇలా అయితే ఇటువంటి కేసుల్లో న్యాయం కోసం మరే మహిళా ముందుకు వచ్చే అవకాశం ఉండదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. అల్ట్రా సౌండ్ పరీక్షలు ఇండియాలో నాలుగ్గోడల మధ్యా జరుగుతూనే ఉన్నాయని, ప్రతి వైద్యుడికీ ఇది క్రైమ్ అని తెలుసునని, అందుకే లింగ నిర్ధారణ విషయాన్ని వ్రాత పూర్వకంగా డాక్టర్లు ఇవ్వరని బాధితురాలు వాపోతోంది. వైద్యురాలినైన నావంటి వారే ఇటువంటి కేసులో ఓడిపోతే మరే మహిళా భవిష్యత్తులో ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాలేదని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తోంది. అప్పట్లో కడుపు నొప్పితోనే ఆమె ఆస్పత్రికి వెళ్ళినట్లుగా జైపూర్ గోల్డెన్ ఆస్పత్రి కోర్టకు ఆధారాలు సమర్పించగా... తనపై అబార్షన్ కు భర్త ఒత్తిడి తేవడంతోనే తాను నొప్పితోనే తిరిగి వచ్చేశానని మీటూ వాదిస్తోంది. మీటూకు నెలలు నిండకుండానే జన్మించిన ఆ ఆడ కవలలకు ఇప్పుడు పదేళ్ళ వయసుంది.

ఆడశిశువుల జననాన్ని అడ్డుకోరాదంటూ ప్రభుత్వం లింగనిర్థారణ పరీక్షలు, చట్ట వ్యతిరేక గర్భ స్రావాలు, భ్రూణ హత్యలను తగ్గించేందుకు కఠిన చట్టాన్ని రూపొందించినా.. వారి మరణాలు అధికమౌతూనే ఉన్నాయి. భారత దేశం లింగ నిర్ధారణ.. గర్భస్రావాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిందని, ఇప్పటికైనా ప్రచారకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించడం ఎంతో అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement