ఫేస్‌బుక్‌లోకి హాకింగ్ | Hacking into Facebook | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లోకి హాకింగ్

Oct 26 2014 2:59 AM | Updated on Jul 26 2018 5:21 PM

ఫేస్‌బుక్‌లోకి హాకింగ్ - Sakshi

ఫేస్‌బుక్‌లోకి హాకింగ్

విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఇప్పుడు సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో భా

న్యూయార్క్: విఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ కూడా ఇప్పుడు సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్‌లో భాగస్వామి అయ్యారు. ఈ సందర్భంగా తన అభిమానులంతా ఆసక్తితో, ఉత్సాహంతో ఉండాలని హాకింగ్ సూచించారు. ‘‘విశ్వం ఎలా ఏర్పడిందనే విషయం నన్ను మొదటి నుంచీ అమితాశ్చర్యానికి గురి చేస్తోంది.

కాలం, అంతరిక్షం అనేవి ఎప్పటికీ మిస్టరీగానే ఉండొచ్చు. అయితే ఇవేవీ నా పనిని ఆపలేవు’’ అని తొలి పోస్ట్‌లో ఆయన వ్యాఖ్యానించారు. హాకింగ్ ఫేస్‌బుక్ పేజీకి ఇప్పటికే తొమ్మిది లక్షల లైక్‌లు రావడం విశేషం.
 
 

Advertisement
 
Advertisement
Advertisement