లైబీరియా కొత్త అధ్యక్షుడికి గుటెరస్‌ అభినందనలు | gutteros congrats Liberia new President | Sakshi
Sakshi News home page

Dec 30 2017 9:11 AM | Updated on Dec 30 2017 9:11 AM

లైబీరియా: లైబీరియా కాబోయే అధ్యక్షుడు జార్జ్‌ వేహ్‌కు ఐక్య రాజ్యసమితి జనరల్‌ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్‌ శనివారం అభినందనలు తెలిపారు. శాంతియుతంగా జరిగిన ఎన్నికల్లో వేహ్‌ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారంటూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను జరుపుకున్నందుకు లైబీరియన్లను అభినందించారు. రెండు ప్రజా యుద్ధాల అనంతరం జరిగి4న ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా వేహ్‌ ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డు నిర్ధారించింది. ఫుట్‌బాల్‌ అంతర్జాతీయ మాజీ ఆటగాడైన వేహ్‌ ఉపాధ్యక్షుడు జోసెఫ్‌ బోకైను ఓడించారు. ఈయన జనవరి 22న అధ్యక్ష పదవిని చేపడతారు. తన ఓటమిని అంగీకరిస్తూ మోకై అధ్యక్షుడిగా ఎన్నికైన వేహ్‌ను అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement