మాధురి దీక్షిత్‌ పాటకు గ్రీక్‌ యువతి డ్యాన్స్‌

Greek Woman Dances To Madhuri Dixit Song To Beat Coronavirus Stress - Sakshi

గ్రీక్‌ దేశానికి చెందిన ఓ యువతి బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌ పాటకు డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఈ యువతి పేరు క్యాథరినా కొరోసిడో. ప్రస్తుతం ఆమె జర్మనీలో నివసిస్తుంది. కాగా కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశ ప్రజలు వణికిపోతున్నారు. ఎక్కడా ఈ వైరస్‌ బారిన పడతామోనని ప్రజలంతా ఆందోళన పడుతున్నారు. (కరోనా కథలు ; మా ఇంటికి రాకండి)

ఇక ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఈ యువతి తన అభిమాన నటి మాధురీ దీక్షిత్‌ పాపులర్‌ సాంగ్‌ ఏక్‌, దో, తీన్‌ పాటకు ఆనందంగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను ఆమె సహోద్యోగి బెలుట్చ్ అనే వ్యక్తి తన ట్విటర్‌లో బుధవారం షేర్‌ చేశాడు. ‘ప్రపంచ దేశాల ప్రజలు కరోనా వైరస్‌(కోవిడ్‌-19) కారణంగా ఆందోళ చెందుతుంటే నా కోలిగ్‌ చూడండి ఏం చేస్తుందో. కరోనా ఒత్తిడి నుంచి బయటపడటానికి తనకు ఇష్టమైన హిందీ నటి మాధురి దీక్షిత్‌ పాటలు వింటూ డ్యాన్స్‌ చేస్తోంది’ అంటూ షేర్‌ చేశాడు. ఈ వీడియోకు ఇప్పటి వరకూ 73 వేలకు పైగా వ్యూస్‌ రాగా.. 5వేల లైక్‌లు వచ్చాయి. 
(‘ఇలాగైతే అమెరికాలో 22 లక్షల మరణాలు’)

అంతేగాక  వీడియోకు మాధురీ కూడా స్పందించారు. ‘ఈ వీడియో నాకు బాగా నచ్చింది.  కరోనావైరస్ నేపథ్యంలో అందరూ ఇంటికే పరిమితమయ్యారు. ఎప్పుడూ బిజిగా ఉండే మీరు ఈ విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకొండి. అంతేగాక  కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. కుటుంబ సభ్యులతో సరదగా గడపండి.  వ్యాయమ చేయండి. పాటలు పాడుతూ డ్యాన్స్‌ చేస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి’ అంటూ చెప్పుకొచ్చారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top