5 లక్షల గూగుల్‌ ప్లస్‌ ఖాతాల డేటా లీక్‌?

Google Plus to close after bug leaks personal information - Sakshi

సాధారణ వినియోగదారులకు సేవలను నిలిపేయనున్న సంస్థ  

కాలిఫోర్నియా: ప్రముఖ సెర్చింజన్‌ గూగుల్‌కు చెందిన సామాజిక మాధ్యమం గూగుల్‌ ప్లస్‌లోని 5 లక్షల ఖాతాల సమాచారం లీకై ఉండొచ్చని తాజా సమాచారం. గూగుల్‌ ప్లస్‌లో తలెత్తిన ఓ సాంకేతిక సమస్య కారణంగా 2015 నుంచి 2018 మార్చి మధ్య కాలంలో ఈ సమాచారం లీక్‌ అయ్యుంటుందని తెలుస్తోంది. అలాగే దాదాపు 10 నెలలపాటు సాధారణ వినియోగదారులు గూగుల్‌ ప్లస్‌ను వినియోగించకుండా సేవలను కంపెనీ ఉపసంహరిస్తోంది. అయితే గూగుల్‌ ప్లస్‌ కార్పొరేట్‌ సేవలు మాత్రం కొనసాగుతాయి. గూగుల్‌ ప్లస్‌లో ఉండిన సాంకేతిక లోపాన్ని తెలుసుకుని వినియోగదారుల సమాచారాన్ని ఎవరైనా దొంగిలించి ఉంటారని తాము భావించడం లేదనీ, ఈ లోపం గురించి ఎవరికీ తెలీదని గూగుల్‌ తెలిపింది. విచారణ సంస్థలకు భయపడి గూగుల్‌ ఈ సమాచారాన్ని దాచేస్తున్నట్లు వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top