ఆ అవార్డులు కూడా వాయిదా!

Gloden Globe Awards Postponed  - Sakshi

లాస్‌ఏంజల్స్‌: ‍కరోనా మహహమ్మారి కారణంగా ఈ ఏడాది జరగాల్సిన అన్ని అవార్డు కార్యక్రమాలను వాయిదా వేస్తూ వస్తున్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రఖ్యాత ఆస్కార్‌ అవార్డులను మొదటిసారి వాయిదా వేయడంతో పాటు అకాడమీ అవార్డులను కూడా వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ప్రముఖ హాలీవుడ్‌ అవార్డుల కార్యక్రమం ‘గోల్డెన్‌ గ్లోబ్’ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఆస్కార్‌ అవార్డులను వాయిదా వేసిన వారం తరువాత ఈ విషయాన్ని ప్రకటించారు. (క‌రోనా: తొలిసారి ఆస్కార్ వాయిదా)

‘టీనా ఫే, యామీ పోలర్‌ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్న 78వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఫిబ్రవరి 28, 2021 ఆదివారం నాడు నిర్వహించనున్నాం. అవార్డు రివైజ్డ్‌ నామినేషన్‌, ఓటింగ్‌ పిరియడ్‌, అర్హతలకు సంబంధించిన తేదీలను తరువాత ప్రకటిస్తాం’  అని అవార్డు సంస్థకు చెందిన ప్రతినిధులు ప్రకటించారు. షెడ్యూల్‌ ప్రకారం 93వ అకాడమీ అవార్డులు జరగాల్సిన రోజున 78 వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈ  కార్యక్రమం డిసెంబర్‌లో జరగనుండగా రెండు నెలలు వాయిదా  పడి ఫిబ్రవరిలో ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నారు. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డులను ఆస్కార్‌ అవార్డులకు సూచికలుగా చూస్తారు. (కరోనా: ఆస్కార్‌ కొత్త నియమాలు)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top