గదర్‌ పార్టీ 105వ వార్షికోత్సవం

Ghadar Party's 105th anniversary celebrated in US - Sakshi

ఎస్టోరియా: దేశ స్వాతంత్య్రం కోసం సాయుధ పోరుబాటను ఎంచుకున్న గదర్‌ పార్టీ 105వ వ్యవస్థాపక దినోత్సవం అమెరికాలో జరిగింది. 1913వ సంవత్సరంలో ఓరెగాన్‌ రాష్ట్రంలోని ఎస్టోరియా పట్టణంలో గదర్‌ పార్టీ ఏర్పడింది. అప్పట్లో పట్టణంలోని కలప డిపోలో కార్మికులుగా పనిచేసే 74 మంది భారతీయులు, ముఖ్యంగా సిక్కులు సమావేశమై పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఆ భవనానికి సమీపంలోనే ఉన్న పార్కులో ఆదివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గదర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో ఓరెగాన్, వాషింగ్టన్, కాలిఫోర్నియా రాష్ట్రాలతోపాటు కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా నుంచి కూడా వందలాది మంది భారతీయ అమెరికన్లు పాల్గొన్నారు. భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త బహదూర్‌ సింగ్‌ గదర్‌ మెమోరియల్‌ ఫౌండేషన్‌ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. బ్రిటిష్‌ పాలనపై గదర్‌ పార్టీ సాగించిన సాయుధ పోరు విజయవంతం కానప్పటికీ స్వాతంత్య్ర సంగ్రామంలో కీలక అధ్యాయంగా నిలిచిపోయింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top