సైనిక దాడిలో గర్భిణి మృతి.. శిశువును కాపాడిన వైద్యులు | Gaza rubble; baby saved from dead mother’s womb | Sakshi
Sakshi News home page

సైనిక దాడిలో గర్భిణి మృతి.. శిశువును కాపాడిన వైద్యులు

Jul 26 2014 7:41 PM | Updated on Sep 2 2017 10:55 AM

సైనిక దాడిలో గర్భిణి మృతి.. శిశువును కాపాడిన వైద్యులు

సైనిక దాడిలో గర్భిణి మృతి.. శిశువును కాపాడిన వైద్యులు

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 23 ఏళ్ల గర్భిణి మరణించింది.

గాజా: ఇజ్రాయెల్ దాడుల్లో గాజా నగరం శిథిలాల దిబ్బగా మారుతోంది. తాజా దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన కనీసం 85 మంది పాలస్తీనీయుల మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ దళాలకు, పాలస్తీనాలోని హమాస్ వర్గానికి మధ్య జరుగుతున్న పోరులో దాదాపు 1000 మంది చనిపోయారు. గాజా నగరంలో ఎటు చూసినా హృదయ విదారక సంఘటనలే.

ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 23 ఏళ్ల గర్భిణి మరణించింది. ఇంటి శిథిలాల కింద పడిఉన్న ఆమె మృతదేహాన్ని గుర్తించి వెంటనే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స చేసి మహిళ గర్భంలో ఉన్న శిశువును రక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement