అవి ఆత్మల కదలికలేనా?! | furniture moving by itself | Sakshi
Sakshi News home page

అవి ఆత్మల కదలికలేనా?!

Oct 20 2017 6:49 PM | Updated on Oct 20 2017 7:00 PM

furniture moving by itself

ఆత్మలు, దయ్యాలు, భూతాలు ఉన్నాయా? లేవా? ఈ ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఎరికి తోచినట్టు వాళ్లు చెబుతారు. కానీ ఖచ్చితమైన జవాబులు మాత్రం ఎవరి వద్దనుంచి రావు. అయితే అప్పుడప్పుడూ.. మేం మీకు కనిపించకపోయినా ఉన్నాం.. అందుకు ఇదిగో నిదర్శనం అంటూ ఆత్మలు చెబుతాయి.

ఇంగ్లడ్‌లోని ప్రఖ్యాత కాంటెర్బరీ నగరం. అందులో టేలర్స్‌ క్లిన్‌ అనే పబ్‌ తెలియని వారుండరు. పగలు.. రాత్రి అన్న తేడా లేకుండా.. జనాలు అక్కడ సమయాన్ని గడిపేస్తారు. ఎప్పటిలానే రాత్రి బాగా పొద్దుపోయాక పబ్‌నుంచి జనాలు వెళ్లిపోయాక.. అక్కడి సబ్బంది కూడా తాళాలు వేసి ఇంటికెళ్లారు.

పబ్‌ సిబ్బంది ఇంటికెళ్లే సమయంలో కిటికీలు, లైట్లు, ఫ్యాన్లు, ఇలా అన్నింటిని జాగ్రత్తగా ఆఫ్ చేసి వెళ్లారు. అయితే ఉదయాన్నే మళ్లీ పబ్‌ తెరిచేసరికి కిటికీలు తెరిచిఉండడం, కొన్ని గదుల్లో ఫ్యాన్లు, లైట్లు వేసి ఉండడాన్ని పబ్‌ యజమాని ఆలిస్టర్‌ కొలిన్స్‌ గుర్తించారు. కరెంట్‌ వృధా అవుతుండడంతో సిబ్బందిపై ఆయన కేకలేశారు. ఉద్యోగులు మేము చాలా జాగ్రత్తగా అన్ని ఆఫ్‌ చేశామని.. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని చెప్పారు. ఆగస్టు 4 నుంచి దాదాపు ప్రతి రోజూ ఇలాగే జరుగుతోందని సిబ్బంది యజమానికి చెప్పారు.

విషయం ఏమిటో తెలుసుకుందామని.. ఆయన సీసీటీవీ ఫుటేజ్‌ తెప్పించారు. ఫుటేజ్‌ చూడగానే ఆలిస్టర్‌తో పాటు సిబ్బందికి కాళ్లు, చేతులు వణికిపోయాయి. సిబ్బంది అంతా రాత్రి ఇంటికి వెళ్లిపోయాక.. కుర్చీలు వాటంతట అవే కదిలేవి. కిటికీలు, లైట్లు, ఫ్యాన్లు ఇలా అన్నింటికీ ఎవరో తెరిచేవారు. సోపాల్లో విలాసవంతంగా కూర్చున్న ఆనవాళ్లు.. మద్యం తాగుతున్నట్లుగా కనిపించే దృశ్యాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. ఆత్మలు.. దయ్యాలు ఉన్నాయో లేవో తెలియదు కానీ.. కంటికి కనిపించని శక్తులు ఏవో నా పబ్‌లో ఉన్నాయని ఆలిస్టర్‌ భయపడ్డారు. అంతేగాక ఆ వీడియోను ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఈ వీడాయో ఇప్పుడు ఫేస్‌బుక్‌లో వైరల్‌గా మారింది.

1
1/5

2
2/5

3
3/5

4
4/5

5
5/5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement