రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవద్దు: ఫేస్బుక్ | facebook asks female employees not to wear distracting dress, claims ex employee | Sakshi
Sakshi News home page

రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవద్దు: ఫేస్బుక్

Jul 4 2016 2:02 PM | Updated on Jul 26 2018 5:23 PM

రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవద్దు: ఫేస్బుక్ - Sakshi

రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవద్దు: ఫేస్బుక్

సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో పనిచేసే మహిళలు రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవద్దని, వాటివల్ల సహోద్యోగుల దృష్టి మరలే అవకాశం ఉందని ఆ సంస్థ యాజమాన్యం చెబుతోందట.

సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్లో పనిచేసే మహిళలు రెచ్చగొట్టే దుస్తులు వేసుకోవద్దని, వాటివల్ల సహోద్యోగుల దృష్టి మరలే అవకాశం ఉందని ఆ సంస్థ యాజమాన్యం చెబుతోందట. ఈ విషయాన్ని గతంలో అక్కడ పనిచేసిన మాజీ ఉద్యోగి ఒకరు తెలిపారు. ఆయన పేరు ఆంటోనియో గార్క్లా మార్టినెజ్. హెచ్ఆర్ ఉద్యోగి తమ శాఖలో పనిచేసే మహిళా ఉద్యోగి నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఈ మేరకు ఉత్తర్వులచ్చారని ఆయన అన్నారు. దాదాపు 10 వేల మందికి పైగా పనిచేసే ఈ కంపెనీలో ఒక ఏడాదికి ముందుకంటే కేవలం ఒక శాతం మంది మాత్రమే మహిళలు ఎక్కువగా ఉన్నారని, మొత్తం ఉద్యోగుల సంఖ్య మాత్రం 40 శాతం పెరిగిందని చెప్పారు. అలాగే.. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణలు ఏమైనా వస్తే వాటిని అంత సీరియస్గా తీసుకోవడం లేదని కూడా అంటున్నారు. ప్రకటనల విభాగంలో ఇలాంటి ఘటన ఒకటి జరిగిందని మార్టినెజ్ చెప్పారు.

ఇక సీఈవో మార్క్ జుకర్బర్గ్ అయితే తరచు అందరిమీద కోపంగా అరుస్తుంటారని ఆరోపించారు. ఫేస్బుక్ కొత్తగా ప్రవేశపెట్టబోతున్న ఒక ఫీచర్ వివరాలను ఓ ఉద్యోగి ప్రెస్కు వెల్లడించగా.. ఆఫీసులో ఉన్న అందరికీ 'ప్లీజ్ రిజైన్' అన్న సబ్జెక్టుతో జుకర్బర్గ్ ఈమెయిల్ చేశారని, ఆ వ్యక్తి మొత్తం టీమ్కు వెన్నుపోటు పొడిచాడంటూ అభివర్ణించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement