
మిచెల్ బ్యాష్లే
యునైటెడ్ నేషన్స్: ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ నూతన చీఫ్‌గా చిలీ మాజీ అధ్యక్షురాలు మిచెల్ బ్యాష్లే ఎన్నికయ్యారు. జొర్డాన్ దౌత్యవేత్త జీద్ రాద్ అల్–హుసేన్ స్థానంలో ఆమె బాధ్యతలు చేపట్టనున్నారు. యూఎన్ మానవ హక్కుల సంస్థ హైకమిషనర్ పదవికి బ్యాష్లే పేరును ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరెస్ ప్రతిపాదించారు. 193 సభ్య దేశాల సాధారణ అసెంబ్లీ శుక్రవారం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 1993లో ఏర్పాటైన యూఎన్ మానవ హక్కుల సంస్థకు బ్యాష్లే ఏడో హైకమిషనర్ కానున్నారు. ఈనెల 31న జీద్ రాద్ పదవీకాలం ముగియనుంది.