లిబియాలో వరుస బాంబు పేలుళ్లు | Double car bombing kills 33 in Benghazi | Sakshi
Sakshi News home page

లిబియాలో వరుస బాంబు పేలుళ్లు

Jan 25 2018 5:39 AM | Updated on Aug 14 2018 3:22 PM

Double car bombing kills 33 in Benghazi - Sakshi

బెంఘాజీ: ఆఫ్రికా దేశమైన లిబియా మంగళవారం వరుస కారు బాంబు పేలుళ్లతో దద్ధరిల్లింది. బెంఘాజీ నగరంలోని ఓ మసీదు నుంచి ప్రార్థనల అనంతరం ప్రజలు బయటికొస్తుండగా రెండు శక్తిమంతమైన కారు బాంబు పేలుళ్లు సంభవించడంతో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుళ్లలో 87 మంది గాయపడ్డారు.

మొదటి కారు బాంబు పేలిన తర్వాత సహాయక చర్యల కోసం అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న ప్రజలే లక్ష్యంగా అరగంట వ్యవధిలో మరో కారు బాంబు పేలిందని అధికారులు తెలిపారు. లిబియా అంతర్యుద్ధంలో ప్రభుత్వానికి అండగా నిలిచిన సలాఫీ గ్రూపులకు కేంద్రంగా ఉండటంతోనే ఈ మసీదుపై దాడి జరిగిందన్నారు. ఈ దాడిని తామే చేసినట్లు ఇంతవరకూ ఏ ఉగ్రసంస్థా  ప్రకటించుకోలేదన్నారు. నాటో బలగాలు 2011లో లిబియా పాలకుడు గడాఫీని హతమార్చినప్పటి నుంచి ఆ దేశం అంతర్యుద్ధంతో అట్టుడుకుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement