పరదేశంలో ప్రశాంతంగా మృత్యు ఒడిలోకి! | David Goodall, 104, takes final journey at Swiss assisted-suicide clinic | Sakshi
Sakshi News home page

పరదేశంలో ప్రశాంతంగా మృత్యు ఒడిలోకి!

May 11 2018 3:55 AM | Updated on May 11 2018 3:55 AM

David Goodall, 104, takes final journey at Swiss assisted-suicide clinic - Sakshi

జెనీవా: కారుణ్య మరణం పొందడం తన దేశంలో సాధ్యం కాదని, మరో దేశం వెళ్లి మరీ తనువు చాలించారు ఓ 104 శాస్త్రవేత్త. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్‌ గుడ్‌ఆల్‌ అనే శాస్త్రవేత్త స్విట్జర్లాండ్‌కు వెళ్లి కారుణ్య మరణం పొందినట్లు స్విస్‌ ఫౌండేషన్‌ వెల్లడించింది. తన జీవితం దుర్భరంగా మారిందని, రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తోందని, తాను చనిపోయేందుకు అనుమతివ్వాలని ఆస్ట్రేలియాలో దరఖాస్తు చేసుకోగా అధికారులు తిరస్కరించారు. దీంతో స్విట్జర్లాండ్‌కు వెళ్లి ప్రశాంతంగా కన్నుమూశారు. కారుణ్య మరణం పొందేందుకు డేవిడ్‌కు సహకరించిన ఎగ్జిట్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు ఫిలిప్‌ నిష్కే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. లైఫ్‌ సైకిల్‌ అనే ఓ క్లినిక్‌లో నెంబుటాల్‌ అనే మందును ఇంజెక్షన్‌ ద్వారా ఎక్కించడంతో డేవిడ్‌ మరణించారని తెలిపారు.

ఆస్ట్రేలియాలోని ఎడిత్‌ కొవాన్‌ యూనివర్సిటీలో రీసెర్చ్‌ ఆసోసియేట్‌గా డేవిడ్‌ పనిచేశారు. ‘నా జీవితం ముగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియాలోనే మరణించడం నాకిష్టం కానీ మరణించే హక్కు కల్పించడంలో అక్కడి చట్టాలు స్విట్జర్లాండ్‌ కన్నా వెనుక ఉన్నాయి’అని డేవిడ్‌ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో కారుణ్య మరణానికి అనుమతి లేదు. అయితే ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో మాత్రం తాజాగా కారుణ్య మరణానికి అనుమతిచ్చినా, అది 2019 జూన్‌ నుంచి అమల్లోకి రానుంది. కానీ స్విట్జర్లాండ్‌లో మాత్రం కారుణ్య మరణం పొందాలని మనస్ఫూర్తిగా, తెలివితో ఉండి కోరితే ఎవరికైనా అనుమతిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement