గూగుల్‌ క్యాంపస్‌లో కూలిన క్రేన్‌.. నలుగురి మృతి | Crane Collapses In Google Seattle Campus | Sakshi
Sakshi News home page

గూగుల్‌ క్యాంపస్‌లో కూలిన క్రేన్‌.. నలుగురి మృతి

Apr 28 2019 1:26 PM | Updated on Apr 28 2019 1:26 PM

Crane Collapses In Google Seattle Campus - Sakshi

సియాటెల్‌: గూగుల్‌ క్యాంపస్‌లో నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న క్రేన్‌ కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..  అమెరికాలోని సియోటల్‌లో గూగుల్‌ నిర్మిస్తున్న నూతన క్యాంపస్‌కు సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో బిల్డింగ్‌పై నుంచి క్రేన్‌ భాగాలు రద్దీగా ఉండే రోడ్డుపై పడిపోయాయి. దీంతో దాదాపు ఆరు కార్లు ధ్వంసం అయ్యాయి. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో కార్లలోని ఇద్దరు వ్యక్తులతోపాటు, ఇద్దరు క్రేన్‌ ఆపరేటర్లు కూడా ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన నలుగురిని ఆస్పత్రికి తరలించారు. అయితే క్రేన్‌ కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement