కరోనా : భారత సంతతి వైద్యురాలు కీలక నిర్ణయం

COVID19 Crisis:Miss England Bhasha Mukherjee Resumes Work As Doctor  - Sakshi

కరోనా పోరులో బ్యూటీ క్వీన్

అందమేకాదు, అందమైన మనసు కూడా 

కరోనా బాధితులకు సేవ చేసేందుకు తిరిగి వైద్య వృత్తిలోకి

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచదేశాలన్నీ దీన్ని అడ్డుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. పరిపాలనా, పోలీసు, రక్షణ వ్యవస్థలతోపాటు ముఖ్యంగా వైద్యులు, నర్సులు, సానిటేషన్ సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. మరోవైపు లాక్ డౌన్ నిబంధనలను నిబద్దతగా పాటిస్తూ ప్రజలు, భారీ విరాళాలతో కార్పొరేట్ దిగ్గజాలు తమ వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో మిస్ ఇంగ్లాండ్ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. 2019లో అందాల రాణిగా నిల్చిన భాషా ముఖర్జీ (24) కరోనా బాధితులను ఆదుకునేందుకు సామాజిక బాధ్యత తీసుకుని మానవత్వాన్ని చాటుకున్నారు.  కరోనా బారిన పడ్డ రోగులకు సేవలందించేందుకు మళ్లీ  వైద్య వృత్తిని చేపట్టారు  ఈమె భారతీయ సంతతికి చెందిన వారు కావడం మరో విశేషం.  

భాషా ముఖర్జీ కోల్‌కతాలో జన్మించారు. ఆమెకు ఎనిమిదేళ్ల వయసులోనే ఆమె కుటుంబం ఇంగ్లాండ్ కు వలసవెళ్లింది.  అక్కడే విద్యాభ్యాసం చేసిన భాషా వైద్య విద్యలో పట్టా పుచ్చుకున్నారు.  అనంతరం శ్వాసకోశ వైద్యంలో ప్రత్యేకతను సాధించారు. అయితే ఆసక్తికరంగా బ్యూటీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె గత ఏడాది ఆగస్టులో మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని అందుకున్నారు. కిరీటం గెలిచుకున్న  తరువాత స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలనే యోచనలో తన వైద్యవృత్తి నుండి విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఆఫ్రికా, టర్కీ, భారతదేశంలో పర్యటిస్తున్నారు. మరిన్ని దేశాలను సందర్శించాలని కూడా అనుకున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా ఇంగ్లాండ్ లో కరోనా వైరస్ విస్తరణ మరింత ఆందోళనకరంగా మారడంతో తాజా నిర్ణయం తీసుకున్నారు. ఇది పెద్ద కఠిన నిర్ణయమేమీ కాదు. ప్రపంచమంతా కరోనా వైరస్ తో ఇబ్బందులు పడుతోంది. మార్చి ప్రారంభం నుంచి ఇంగ్లాండ్ లో కరోనా క్రమంగా విజృంభిస్తోంది. రెండు లేదా మూడు వారాలుగా  ఈ మార్పులను గమనిస్తున్నాను. తూర్పు ఇంగ్లాండ్ బోస్టన్లో ఉన్న పిలిగ్రిమ్ ఆసుపత్రిలోని వివిధ భాగాల్లో నా సహచరులు నిరంతరం సేవలందిస్తున్నారు. ఇంతకుముందెన్నడూ చేపట్టని బాధ్యతలను కూడా తీసుకుంటున్నారు. అందుకే తన పర్యటనను వాయిదా వేసుకొని తాను కూడా టాస్క్‌ఫోర్స్‌లో చేరాలని నిర్ణయించుకున్నాని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే నాలుగు వారాల భారతదేశ పర్యటనలో అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని భాషా బుధవారం యూకేకు తిరిగి వెళ్లారు. అంతేకాదు ఆసుపత్రి బాధ్యతలను స్వీకరించే ముందు ఒకటి, రెండు వారాల వరకు సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండనున్నానని వెల్లడించారు. ఇంగ్లాండ్కు సహాయం చేయడానికి తనకు ఇంతకన్నా మంచి అవకాశం రాదని  భాషా ముఖర్జీ వ్యాఖ్యానించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

01-07-2020
Jul 01, 2020, 15:30 IST
హైదరాబాద్‌: కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో టీవీ పరిశ్రమ ముందు వరుసలో ఉంటుంది. లాక్‌డౌన్‌ కారణంగా గత మూడు నెలలుగా...
01-07-2020
Jul 01, 2020, 15:13 IST
వాష్టింగ్టన్ : క‌రోనా కల్లోలంతో విలవిల్లాడుతున్న అమెరికా కీలక  నిర్ణయం తీసుకుంది. అమెరికా ఔషధ దిగ్గజం గిలియడ్ సైన్సెస్ కు చెందిన  రెమ్‌డిసివిర్ ఔష‌ధాన్ని...
01-07-2020
Jul 01, 2020, 14:51 IST
ల‌క్నో :  ప్ర‌పంచ వ్యాప్తంగా కోవిడ్ విజృంభిస్తూనే ఉంది. క‌రోనాకు సామాన్యులు, ప్ర‌ముఖులు అన్న తేడా లేదు. ఇప్ప‌టికే ఎంతోమంది...
01-07-2020
Jul 01, 2020, 14:11 IST
ముంబై: దేశంలో క‌రోనా ధాటికి అత‌లాకుత‌ల‌మ‌వుతున్న న‌గ‌రాల్లో ముంబై ముందు స్థానంలో ఉంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే నెల‌లో వినాయ‌క...
01-07-2020
Jul 01, 2020, 14:02 IST
సాక్షి,న్యూఢిల్లీ:  కరోనా నివారణకు పతంజలి ఆయుర్వేద ఔషధంలో మరో కొత్త ట్విస్టు చోటు చేసుకుంది. కోవిడ్-19 క్లినికల్ ట్రయల్‌కు సంబంధించిన అన్ని పత్రాలను...
01-07-2020
Jul 01, 2020, 11:21 IST
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ వెలుగుచూసినప్పటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని జాగ్రత్త చర్యలు చేపట్టినా.....
01-07-2020
Jul 01, 2020, 10:55 IST
బ్రెసీలియా: బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సనారో పబ్లిక్‌ మీటింగు‌లలో తప్పక మాస్క్‌ ధరించాలంటూ అక్కడి కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే....
01-07-2020
Jul 01, 2020, 10:17 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ విజృంభణ దేశంలో నానాటికీ పెరుగుతోంది. ఓవైపు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు...
01-07-2020
Jul 01, 2020, 09:46 IST
వాషింగ్టన్‌: ప్రపంచాన్ని కలవర పెడుతోన్న కరోనా వైరస్‌ అమెరికాలో తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం కరోనా కేసుల్లో అమెరికా ప్రపంచలోనే...
01-07-2020
Jul 01, 2020, 09:03 IST
వాషింగ్టన్ : కరోనా వైరస్  అమెరికాను వణికిస్తోంది. మరోవైపు భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైతే రోజుకు లక్ష కొత్త కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందని...
01-07-2020
Jul 01, 2020, 08:56 IST
పెరుగుతున్న కోవిడ్‌–19 పాజిటివ్‌ కేసులతో జనం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. రోజురోజుకూ రికార్డు స్థాయిలో మహమ్మారి కేసులు నమోదవుతున్నాయి. నగరవ్యాప్తంగా అన్ని...
01-07-2020
Jul 01, 2020, 08:07 IST
పారిస్‌: యూరోపియన్‌ యూనియన్‌ జూలై 1వ తేదీనుంచి 15 దేశాల సరిహద్దులను మళ్లీ తెరుస్తున్నట్లు ప్రకటించింది. అయితే కరోనా వైరస్‌...
01-07-2020
Jul 01, 2020, 05:30 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలను గణనీయంగా పెంచినందున చాలామంది పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని మంత్రి ఈటల...
01-07-2020
Jul 01, 2020, 04:33 IST
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతోంది. మంగళవారం కొత్తగా 18,522 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ...
01-07-2020
Jul 01, 2020, 04:28 IST
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ టీకా అందరికీ అందుబాటులో, చవకగా లభించాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టీకా...
01-07-2020
Jul 01, 2020, 02:31 IST
సాక్షి, అమరావతి: ఏపీలో కరోనా పరీక్షలు 9 లక్షలకు చేరువయ్యాయి. మంగళవారం నాటికి 8.90 లక్షల పరీక్షలు పూర్తవ్వగా.. ఈ...
30-06-2020
Jun 30, 2020, 21:17 IST
బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా కర్ణాటకలోని తుముకూరు జిల్లాలోని ఓ...
30-06-2020
Jun 30, 2020, 20:46 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా  945 కరోనా...
30-06-2020
Jun 30, 2020, 18:57 IST
చెన్నై: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ రోజురోజుకు పెరుగుతోంది. ఈ మహమ్మారి సామాన్య ప్రజానీకం నుంచి ప్రజాప్రతినిధుల వ‌ర‌కు ఎవ‌రినీ వ‌ద‌ల‌డం...
30-06-2020
Jun 30, 2020, 18:40 IST
చెన్నై : దేశ‌వ్యాప్తంగా అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోద‌వుతున్న రాష్ట్రాల్లో త‌మిళ‌నాడు ఒక‌టి. దీంతో లాక్‌డౌన్ 6.0 విధిస్తూ ప్ర‌భుత్వం...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top