చైనా మొదలెట్టింది.. థూ! మీరిక మారరా?..

Chinese Markets Are Still Selling Bats And Snakes On Streets - Sakshi

బీజింగ్‌ : చావు తప్పి కన్ను లొట్టపోయినా చైనా ప్రజల్లో మాత్రం మార్పు రాలేదు. ఏ ఇష్టానుసార ఆహార శైలితో ఇబ్బందులు పడ్డారో.. మళ్లీ అదే వైపు అడుగులు వేస్తున్నారు. భయంకరమైన కరోనా వైరస్‌ను ప్రపంచ దేశాలకు అంటగట్టి, దాన్నుంచి బయటపడ్డామన్న విజయోత్సాహంతో సంబరాలు చేసుకుంటున్నారు. కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాల మాంసం కోసం క్యూలు కడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్‌ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చైనా నెలల లాక్‌డౌన్‌కు తాజాగా స్వప్తి పలికింది. ముందులాగే ప్రజలు ప్రశాంతంగా జీవనం గడపొచ్చని ప్రభుత్వం ప్రజలకు శుభవార్త చెప్పింది. దీంతో చైనా ప్రజలు సంబురాలకు తెరతీశారు. చప్పబడిన నాలుకలకు పని చెబుతున్నారు. శనివారం సౌత్‌ వెస్ట్‌ చైనాలోని గుయ్‌లిన్‌లో కుక్కలు, పిల్లులు, తేళ్లు, గబ్బిలాలు, పాములు ఇతర రకాల క్రిమి కీటకాలు, జంతువుల మాంసం షాపుల వద్ద పెద్ద సంఖ్యలో క్యూలు కట్టారు. ( క‌రోనా వ‌ల్ల ఓ మంచి జ‌రిగింది: న‌టుడు )

దీనికి తోడు పలు రకాల జీవుల మాంసంతో తయారు చేసిన చైనా ఆయుర్వేద షాపులు సైతం రోడ్లమీద దర్శనమిచ్చాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు కొన్ని సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ‘‘ థూ! మీరిక మారరారా?.. చైనా నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఎదురుచూస్తాం.. బుద్ధుంటే మరోసారి చైనా వస్తువుల్ని వాడకూడదు.. వీళ్లు చచ్చినా బాగుపడరు ’’ అంటూ మండిపడుతున్నారు. ( కరోనాపై పోరాటం: శుభవార్త చెప్పిన కేటీఆర్‌ )

చదవండి : ‘మహానుభావుడు’ అప్పట్లోనే చెప్పాడు!! 

కరోనా: వాటి రక్తం ఎలా తాగుతార్రా నాయనా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top