పార్క్లో పేలుడు; 200 మందికి గాయాలు | at leaset 200 injured in Tiwan blast | Sakshi
Sakshi News home page

పార్క్లో పేలుడు; 200 మందికి గాయాలు

Jun 27 2015 10:19 PM | Updated on Apr 3 2019 3:52 PM

పార్క్లో పేలుడు; 200 మందికి గాయాలు - Sakshi

పార్క్లో పేలుడు; 200 మందికి గాయాలు

తైవాన్ రాజధాని తైపీలోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్లో శనివారం రాత్రి 8.40 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది.

తైపీ: తైవాన్ రాజధాని తైపీలోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్లో శనివారం రాత్రి 8.40 ప్రాంతంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో 200మందికి పైగా గాయపడినట్టు తెలిసింది. వారాంతపు సెలవుదినం కావడంతో పెద్ద ఎత్తునా సందర్శకులు వాటర్ పార్క్కు తరలివచ్చారు. ఇదే క్షతగాత్రుల సంఖ్య పెరగడానికి కారణమైనట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వాటర్ పార్క్లోని ఫర్మోసా ఫన్ కోస్ట్ వద్ద వినోదం కోసం ఓ పెద్ద 'కలర్ పార్టీ' ఏర్పాటు చేశారు.

ఈ కలర్ పార్టీలో భాగంగా రసాయనాలు కలిసిన రంగురంగుల పౌడర్తో నింపారు. ఇంతలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. దాంతో రంగులతో కూడిన దుమ్ము పార్క్ అంతా ఆవరించింది. రంగుల పౌడర్ పెద్దఎత్తునా గాలిలోకి ఎగసింది. ఆ సమయంలో సందర్శకులు స్మిమ్మింగ్ దుస్తులు  ధరించి ఉండటంతో ఆ రసాయనాల పౌడర్ ధాటికి వారంతా గాయాలయినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement