లెజెండరీ సింగర్‌ కన్నుమూత

Aretha Franklin Dead at 76 - Sakshi

అరెతా ఫ్రాంక్లిన్‌ ‘ది క్వీన్‌ ఆఫ్‌ సోల్‌’  కన్నుమూత

లెజెండరీ సింగర్‌  అరెతా  ఫ్రాంక్లిన్ (76) కన్నుమూశారు. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె  డెట్రాయిట్‌లోని తన ఇంటిలో ఆమె గురువారం తుదిశ్వాస విడిచారు. మార్చి 25, 1942న  పుట్టిన అరేత లూయిస్ ఫ్రాంక్లిన్ 14 ఏళ్ళ వయసులోనే  మొదటి ఆల్బం "ది గాస్పల్ సౌండ్ అఫ్ అరేతా ఫ్రాంక్లిన్" ను విడుదల చేశారు.  తన మొదటి ఆల్బంతోనే సంగీతప్రియులకు  ఉర్రూత లూగించారు. 

మహిళల హక్కుల కోసం  "రెస్పెక్ట్" (1967) గీతంతో బాగా పాపులర్‌ అయ్యారు.  1968లో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అంత్యక్రియలలో ఫ్రాంక్లిన్ "ప్రియస్ లార్డ్, టేక్ మై హ్యాండ్"  పాట, అమెరికా అధ్యక్షుడి బరాక్ ఒబామా ప్రమాణీస్వీకార  ఉత్సవ  వేడుకల్లో "మై కంట్రీ," "ఈస్ ఆఫ్ థీ" ఆమె కరియర్‌లో మైలురాళ్లు. అంతేకాదు ప్రసిద్ధి చెందిన అత్యంత ప్రభావవంతమైన కళాకారులు అందుకునే రాక్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ​ పురస్కారాన్ని అందుకున్నతొలి మహిళ.  18 గ్రామీ అవార్డులను అందుకున్నారు.

అరెతా మృతిపై  పలువురు  సెలబ్రిటీలు, ఇతర గాయకులు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. ఆమె లేకుండా ప్రపంచాన్ని ఊహించటం కష్టం, ఆమె ఒక ప్రత్యేకమైన గాయకురాలు మాత్రమే కాదు, పౌర హక్కులకు, మహిళాసాధికారత కోసం పనిచేసిన  గొప్ప మనిషి. ఆమె నిబద్ధతతో ప్రపంచంపై చెరగని ప్రభావాన్ని చూపించారంటూ బార్బ్రా స్ట్రీసాండ్, జాన్ లెజెండ్  తదితరులు తీవ్ర  విచారాన్ని వ్యక‍్తం చేశారు. ఆపిల్‌ సీఈవో టిమ్‌ కుక్‌ స్పందిస్తూ సంగీతం ద్వారా ఆమె ప్రపంచానిచ్చారు.  ఆమె స్వరం మనకు ఊతమిస్తూనే వుంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలంటూ  ఆమె కుటుంబానికి, అభిమానులకు సానుభూతిని ప్రకటించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top