ట్రంప్ పై మండిపడుతున్న బిజినెస్ లీడర్లు | Apple CEO Tim Cook Urged President Trump to Stay in the Paris Climate Agreement | Sakshi
Sakshi News home page

ట్రంప్ పై మండిపడుతున్న బిజినెస్ లీడర్లు

Jun 1 2017 7:13 PM | Updated on Aug 20 2018 3:07 PM

ట్రంప్ పై మండిపడుతున్న బిజినెస్ లీడర్లు - Sakshi

ట్రంప్ పై మండిపడుతున్న బిజినెస్ లీడర్లు

క‌ర్బ‌న్ ఉద్గ‌రాల విడుద‌ల‌ నియంత్ర‌ణ‌కు కుదుర్చుకున్న ఎంతో చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

క‌ర్బ‌న్ ఉద్గ‌రాల విడుద‌ల‌ నియంత్ర‌ణ‌కు కుదుర్చుకున్న ఎంతో చరిత్రాత్మకమైన పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు.  పారిస్ వాతావరణ ఒప్పందానికి ట్రంప్ కట్టుబడి ఉండాలని ఆపిల్ సీఈవో టిమ్ కుక్, ఇతర బిజినెస్ లీడర్లంటున్నారు. ఈ విషయంపై మంగళవారమే టిమ్ కుక్, వైట్ హౌజ్ కు ఫోన్ చేసి అధ్యక్షుడితో మాట్లాడారని బ్లూమ్ బర్గ్ న్యూస్ రిపోర్టు చేసింది. కానీ ఒక్కరోజులోనే అంటే బుధవారం ఈ అగ్రిమెంట్ నుంచి అమెరికా వైదొలుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాలు చెప్పాయి.
 
కర్బన్ ఉద్గారాల శాతాన్ని తగ్గించడానికి దాదాపు అన్ని దేశాలు దీనిలో సంతకాలు చేశాయి. అయితే ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకం చేసేందుకు మాత్రం ట్రంప్ నిరాకరించారు. ఇంతకుముందు దీనిపై నిర్ణయం తీసుకోడానికి తనకు మరింత సమయం అవసరమని ఆయన చెప్పారు. డెమొక్రాట్లు, పర్యావర్ణ కార్యకర్తలు, కొందరు వ్యాపార నాయకుల నుంచి వస్తున్న విమర్శలు పట్టించుకోకుండా.. వెంటనే ఈ ఒప్పందం నుంచి వైదొలగాలని ట్రంప్ నిర్ణయించినట్టు రిపోర్టులు తెలిపాయి. నేడు దీనిపై  ట్రంప్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఒకవేళ అమెరికా ఈ అగ్రిమెంట్ నుంచి తప్పుకుంటే వైట్ హౌజ్ అడ్వయిజరీ కౌన్సిల్స్ కు తాను రాజీనామా చేస్తానని టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement