అడవి నుంచి ఆకాశానికి.. తొలి గిరిజన ఫైలెట్‌

Anupriya Lakra Becomes first Woman Pilot From Odisha - Sakshi

కమర్షియల్‌ విమానాన్ని నడిపే తొలి ఆదివాసీ పైలట్‌గా అనుప్రియ

భువనేశ్వర్‌ : గిరిజన గూడాల్లో పుట్టిన ఓ అడవి బిడ్డ ఆకాశానికెగిరింది. చదవుకోడానికి కనీస సదుపాయాలు లేని గ్రామీణ ప్రాంతంలో పుట్టి.. ఏకంగా ఫైలెట్‌గా ఎదిగి ప్రశంసలు అందుకుంటోంది. ఒడిశాలోని మావోయిస్టు ప్రాభల్య ప్రాంతమైన మల్కాన్‌గిరి గిరిజన ప్రాంతానికి చెందిన అనుప్రియా లక్రా(23).. తొలి మహిళా ఫైలెట్‌గా సువర్ణావకాన్ని దక్కించుకున్నారు. కమర్షియల్‌ విమానాన్ని నడిపే ఆదివాసీ మహిళా పైలట్‌గా అనుప్రియ లక్రా చరిత్ర సృష్టించారు. ఈ విధంగా నియమితులైన తొలి గిరిజన యువతి అనుప్రియానే కావడం విశేషం.

చిన్నతనం నుంచి పైలట్‌ కావాలని కలలు కన్న అనుప్రియ...2012లో ఇంజినీరింగ్‌ విద్యను మధ్యలోనే వదిలేసి పైలట్‌ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమయింది. అందులో ఉత్తీర్ణత సాధించి భువనేశ్వరన్‌లోని పైలట్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో చేరారు. ఏడేళ్ల పాటు కష్టపడి ఇటీవలే ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో కో-పైలట్‌గా ఉద్యోగం సాధించింది. త్వరలోనే కమర్షియల్ ఫ్లైట్స్ ను నడపనుంది. మూలన విసిరేసినట్లు ఉండే గ్రామం నుంచి వచ్చి కమర్షియల్ ఫ్లైట్ నడిపే తొలి ఆదివాసీ మహిళ పైలెట్ ఘనతను సాధించిన అనుప్రియ ఎందరో మహిళలకు ఆదర్శం అంటూ ఆమెపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దేశ వ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ సందర్భంగా ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ అనుప్రియకు అభినందనలు తెలియజేశారు. ‘అనుప్రియ లక్రా గురించి తెలిసి చాలా ఆనందపడ్డాను. నిబద్ధత, పట్టుదలతో ఆమె అరుదైన విజయాన్ని సాధించారు. ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు’ అంటూ పట్నాయక్‌ ప్రశంసించారు. అనుప్రియ తండ్రి మరినియాస్‌ లక్రా.. ఒడిశా పోలీస్‌ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top