రెండు ముక్కలుకానున్న ఆఫ్రికా ఖండం..?? | Africa to Split Into Two Parts In Several Million Years | Sakshi
Sakshi News home page

రెండు ముక్కలుకానున్న ఆఫ్రికా ఖండం..??

Apr 1 2018 4:40 PM | Updated on Apr 1 2018 4:40 PM

Africa to Split Into Two Parts In Several Million Years - Sakshi

ఒకవేళ ఆఫ్రికా ఖండం ముక్కలైతే ఇలా ఉండొచ్చు (ఊహాజనిత చిత్రం)

సాక్షి, వెబ్‌ డెస్క్‌ : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఖండమైన ఆఫ్రికా రెండుగా చీలిపోనుందా..? ఆఫ్రికా వాసుల మెదళ్లను ప్రస్తుతం తొలుస్తున్న ప్రశ్న ఇదే. కెన్యా రాజధాని నైరోబికి చేరువలోని హైవేపై ఏర్పడిన పగులు ఈ ఆందోళనలకు కేంద్ర బిందువు అయింది. టెక్టోనిక్‌ ప్లేట్లలో నైరుబీ వద్ద వస్తున్న కదలికలు ఆఫ్రికా రెండుగా విడిపోతుందనే నమ్మకాన్ని బలపరుస్తున్నాయి.


 
నైరుతీ కెన్యాలో గల రిఫ్ట్‌ వ్యాలీ వద్ద భారీ పగులు ఏర్పడింది. కొన్ని మైళ్ల పాటు విస్తరించిన ఈ పగులు కారణంగా నైరోబీ-నరోక్‌ హైవే కూడా దెబ్బతింది. అంతేకాదు కొన్ని ఇళ్లు సగానికి చీలిపోయాయి కూడా. ఈ పగులు కారణంగా భవిష్యత్‌లో ఆఫ్రికా రెండు ముక్కలు అవుంతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అయితే ఇందుకు కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందని చెప్పారు.

నుబియన్‌ ప్లేట్‌ నుంచి సోమాలి టెక్టానిక్‌ ప్లేట్‌ విడిపోయే క్రమంలో ఈ చీలిక జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అతి నెమ్మదిగా జరిగే ఈ ప్రక్రియ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత పూర్తవుతుందని వివరించారు. ప్రకృతి బద్దంగా జరిగే ఈ ప్రక్రియను అడ్డుకోవడం అసాధ్యమని పేర్కొన్నారు.

విడిపోయే ముక్కలో ఉండే సోమాలియా, కెన్యా, ఇథియోపియాలు హిందూ మహాసముద్రంలో ద్వీపాలుగా మారుతాయని చెప్పారు. దీనివల్ల ఆఫ్రికా ఖండం చిన్నగా మారుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement