ఐఎస్ ఉగ్రవాదుల సొంత రేడియో స్టేషన్! | Afghan IS sets up radio station for fresh recruitment | Sakshi
Sakshi News home page

ఐఎస్ ఉగ్రవాదుల సొంత రేడియో స్టేషన్!

Dec 20 2015 6:49 PM | Updated on Sep 3 2017 2:18 PM

ఐఎస్ ఉగ్రవాదుల సొంత రేడియో స్టేషన్!

ఐఎస్ ఉగ్రవాదుల సొంత రేడియో స్టేషన్!

ఆప్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్ అనుకూల ఉగ్రవాదులు సొంతంగా ఓ రేడియో స్టేషన్ను ఏర్పాటు చేసుకొని తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు.

కాబూల్: ఆప్ఘనిస్తాన్లోని ఇస్లామిక్ స్టేట్ అనుకూల ఉగ్రవాదులు సొంతంగా ఓ రేడియో స్టేషన్ను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా తమ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారు. రేడియో కార్యక్రమాల ద్వారా ప్రజలకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిస్తూ.. యువతను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారు. ఈ విషయాన్ని ఆప్ఘనిస్తాన్ అధికారులు ఆలస్యంగా గుర్తించారు.

ఉగ్రవాదులు 'వాయిస్ ఆఫ్ ఖలీఫా' పేరిట రేడియో స్టేషన్ను ఏర్పాటు చేసి స్థానిక 'పాష్తో' భాషలో తమ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నారు. జలాలాబాద్, ఇతర జిల్లాల్లో ఈ రేడియో ప్రసారాలు జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్రమైన పదజాలంతో ప్రసారాలు జరుగుతున్నట్లు గుర్తించిన అధికారులు రేడియో స్టేషన్ కార్యకలాపాలు ఎక్కడి నుండి నిర్వహిస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే రేడియో ప్రసారాలు ప్రజలకు చేరకుండా తగు చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement