పట్టాలపై పడి బతికి బయటపడ్డాడు

commuters rush to save Faint Man collapse on Railway Track

సాక్షి : తన తోటి ప్రయాణికులు సమయ స్ఫూర్తితో వ్యవహరించటంతో ప్రాణాలతో బయటపడ్డాడు ఓ వ్యక్తి. ఆస్ట్రేలియాలోని విన్‌యార్డ్‌ రైల్వే స్టేషన్‌లో సోమవారం మధ్యాహ్నాం ఈ ఘటన చోటు చేసుకుంది. 

సుమారు 2 గంటల సమయంలో రైలు కోసం ఎదురు చూస్తున్న ఓ ప్రయాణికుడు ఉన్నట్లుండి కళ్లు తిరిగి పట్టాలపై పడిపోయాడు. వెనకాలే ఉన్న వృద్ధుడు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. సరిగ్గా పట్టాల మధ్యలో పడి అతను స్పృహ కోల్పోయాడు. ఇంతలో దూరం నుంచి రైలు కూత వినిపించింది.  పక్కనే ఉన్న ప్రయాణికులంతా అతన్ని కాపాడాలంటూ అరిచారు. అది గమనించిన ఓ అధికారి రెండు చేతులెత్తి రైలును ఆపాల్సిందిగా సైగ చేశారు. 

రైలు ఆగిందో లేదో స్పష్టత లేదుగానీ.. ప్రయాణికుల్లో అరుగురు పట్టాల మీదకు దూకి అతన్ని కాపాడేశారు. తలకు చిన్నగాయంతో అతను బయటపడటం విశేషం. స్టేషన్‌లోని సీసీపుటేజీ వీడియోలో ఘటన అంతా నిక్షిప్తం కాగా, ఆ వీడియో బయటకు రావటంతో వైరల్‌ అవుతోంది. ప్రమాదకర పరిస్థితులను సైతం లెక్క చేయకుండా అతన్ని కాపాడిన ప్రయాణికులను పలువురు అభినందిస్తున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top