ప్రవాస భారతీయ దంపతులకు 30 ఏళ్ల జైలు! | 30 years prison to Indian couple ! | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయ దంపతులకు 30 ఏళ్ల జైలు!

Apr 30 2016 1:47 AM | Updated on Apr 4 2019 3:19 PM

ప్రవాస భారతీయ దంపతులు రాజు కోసూరి(44), ఆయన భార్య(45) స్మృతి ఝరియాలు హెచ్-1బీ అక్రమ వీసాల కేసులో దోషులుగా తేలారు.

వాషింగ్టన్: ప్రవాస భారతీయ దంపతులు రాజు కోసూరి(44), ఆయన భార్య(45) స్మృతి ఝరియాలు హెచ్-1బీ అక్రమ వీసాల కేసులో దోషులుగా తేలారు. వీరికి 30 ఏళ్ల జైలు శిక్ష పడే వీలుందని అమెరికన్ న్యాయ శాఖ తెలిపింది. ఏస్‌బర్న్‌లో నివసించే ఈ జంటతోపాటు మరో నలుగురు వీసా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీసాలను సృష్టించి వీరు ఇప్పటి దాదాపు 20 మిలియన్ డాలర్లు ఆర్జించినట్లు ఆరోపణలు ఉన్నాయని న్యాయశాఖ పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement