మాఫియా వ్యాపారి నుంచి వేల కోట్లు స్వాధీనం | 215 million euros of assets seized from businessman | Sakshi
Sakshi News home page

మాఫియా వ్యాపారి నుంచి వేల కోట్లు స్వాధీనం

Apr 19 2016 2:05 PM | Updated on Sep 3 2017 10:16 PM

ఇటలీలో ఓ వ్యాపారవేత్త నుంచి యాంటీ మాఫియా పోలీసులు కళ్లుతిరిగే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.

ఇటలీలో ఓ వ్యాపారవేత్త నుంచి యాంటీ మాఫియా పోలీసులు కళ్లుతిరిగే ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. రియల్ ఎస్టేట్, కంపెనీలు, బ్యాంకు ఖాతాలు, షాపింగ్ మాల్.. ఇలా వాళ్లు స్వాధీనం చేసుకున్న పలు రకాల ఆస్తుల విలువ ఏకంగా రూ. 1615 కోట్లుగా తేలింది. దాదాపు 20 ఏళ్ల పాటు ఓ మాఫియా గ్యాంగు తరఫున ఆర్థిక లావాదేవీలు నడిపించిన ఆల్ఫోన్సో అనుంజియాటా అనే వ్యాపారవేత్తవద్ద నుంచి ఈ మొత్తం ఆస్తులు పోలీసుల చేతికి వచ్చాయి.

ఎల్ అనుంజియాటా షాపింగ్ మాల్‌తో పాటు ఆరు కంపెనీలు, 85 రియల్ ఎస్టేట్ ఆస్తులు, 42 బ్యాంకు ఖాతాలు, రూ. 5 కోట్ల నగదును తాము స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనుంజియాటాను గత సంవత్సరం మార్చిలోనే పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా, బెదిరింపులు, మనీలాండరింగ్ రాకెట్లను కొన్ని దశాబ్దాలుగా ఈ మాఫియా నడిపిస్తోంది. అంతర్జాతీయ క్రైం సిండికేట్లలో ఇటాలియన్ల పేరు కూడా మార్మోగిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement