రోడ్డుపై పడేసి, మీద కూర్చొని పిడిగుద్దులు... | 2 women in caught-on-camera Valley Stream parking lot brawl arrested | Sakshi
Sakshi News home page

రోడ్డుపై పడేసి, మీద కూర్చొని పిడిగుద్దులు...

Apr 30 2015 11:49 AM | Updated on Sep 3 2017 1:10 AM

రోడ్డుపై పడేసి, మీద కూర్చొని పిడిగుద్దులు...

రోడ్డుపై పడేసి, మీద కూర్చొని పిడిగుద్దులు...

పార్కింగ్ స్థలం కోసం జరిగిన గొడవ కాస్తా ముదిరి ఇద్దరు మహిళలు కొట్టుకునే వరకు వెళ్లింది.

న్యూయార్క్: పార్కింగ్ స్థలం కోసం జరిగిన గొడవ కాస్తా ముదిరి ఇద్దరు మహిళలు కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ వీడియో  సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో హల్ చల్ చేస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... ఆదివారం రోజున వ్యాలీ స్ట్రీమ్ లోని గ్రీన్ ఎకర్స్ మాల్ ఎదుట పార్కింగ్ స్థలంలో  24 ఏళ్ల లటోయియా  తమ కారుని పార్క్ చేయడానికి వెళ్లింది. అయితే అదే స్థలంలో తమ వాహనాన్ని పార్క్ చేసుకుంటామని ఒక వ్యక్తి కారుని ఆపాడు. కారు దిగిన లటోయియా తనను ఆస్థలంలో ఎందుకు కారును పార్క్ చేయనివ్వలేదని అడిగింది.

 

దీంతో కారు పార్క్ చేసిన వ్యక్తి భార్య త్వానా మోరెల్(లావుగా ఉండి నారింజ రంగు డ్రెస్ వెసుకున్న35 ఏళ్ల మహిళ)  లటోయియాతో వాగ్వాదానికి దిగింది. తన నోటికి పని చెప్పటంతో  ఆగకుండా తన భర్త, కుమారుడు చూస్తుండగానే సదరు మహిళని రోడ్డుపై పడేసి, మీద కూర్చొని ముఖం మీద పిడిగుద్దులు కురిపించింది. మరోవైపు భార్యను వారించాల్సిన  భర్త కూడా మరింత కొట్టమని ప్రోత్సహించడంతో బాధితురాలిని చితక బాదింది. చివరికి ఈ వీడియో బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement