భవనంలో పేలుడు: 10 మందికి గాయాలు | 10 injured in residential building explosion in China | Sakshi
Sakshi News home page

భవనంలో పేలుడు: 10 మందికి గాయాలు

Jun 12 2015 8:26 AM | Updated on Sep 3 2017 3:38 AM

చైనా ఈశాన్య ప్రాంతంలో హులుడో నగరంలోని నివాస భవనంలో శుక్రవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది.

బీజింగ్: చైనా ఈశాన్య ప్రాంతంలో హులుడో నగరంలోని నివాస భవనంలో శుక్రవారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 10 మంది గాయపడ్డారని ఉన్నతాధికారులు వెల్లడించారు. స్థానికుల సహాయంతో పోలీసులు క్షతగాత్రులను నగరంలోని వివిధ  ఆసుపత్రులకు తరలించి... చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ ప్రమాదానికి వంట గ్యాస్ లీక్ కారణమని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. గతనెల 31వ తేదీన ఇదే నగరంలో ఇదే తరహా పేలుడు సంభవించి ఇద్దరు మరణించగా... 11 మంది గాయపడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement