వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు.
హైదరాబాద్ : ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. శాసనసభ సమావేశాలు పది నిమిషాలు వాయిదా అనంతరం ఆయన సీఎల్పీలో ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. సభలో అనుసరించాల్సిన వ్యూహంతోపాటు ప్రత్యేక హోదా, భవిష్యత్ కార్యాచరణపై వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో చర్చించారు. కాగా రెండోరోజు కూడా అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ సభ్యులు ప్రత్యేక హోదాపై చర్చకు పట్టుబట్టారు.