
వైఎస్ జగన్ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అందరూ మంచితనంతో ముందుకుసాగాలన్న స్ఫూర్తిని శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ చాటుతుందని ఆయన ఒక సందేశంలో పేర్కొన్నారు. శ్రీ కృష్ణుడి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది శ్రీ కృష్ణాష్టమి పర్వదినం జరుపుకొంటున్న సంగతి తెలిసిందే.