రెండేళ్లుగా ఇదే రీల్ తిప్పుతున్నారు:వైఎస్ జగన్ | YS Jagan mohan reddy challenges andhra pradesh government over denial of special status to AP | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా ఇదే రీల్ తిప్పుతున్నారు:వైఎస్ జగన్

Mar 16 2016 2:00 PM | Updated on Mar 23 2019 9:10 PM

రెండేళ్లుగా ఇదే రీల్ తిప్పుతున్నారు:వైఎస్ జగన్ - Sakshi

రెండేళ్లుగా ఇదే రీల్ తిప్పుతున్నారు:వైఎస్ జగన్

ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుంటే ఎలా అని ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

హైదరాబాద్ :  ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్కు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుంటే ఎలా అని ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  సూటిగా ప్రశ్నించారు. ఆయన బుధవారం అసెంబ్లీలో మాట్లాడుతూ విభజన హామీల అమలు కోసం తీర్మానం చేయడం ఇది రెండోసారి అని, రెండేళ్లుగా చంద్రబాబు నాయుడు ఇదే రీలు తిప్పుతున్నారన్నారు.

 

ఇక్కడేమో బీద అరుపులు...అక్కడేమో పొగడ్తలు అని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు. ఇప్పటికే రెండేళ్లు గడిచింది అని, నెల రోజుల్లో అమలు చేయకుంటే కేంద్రం నుంచి వైదొలగుతామని అల్టిమేటం ఇస్తారా అని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఉత్తరాంధ్ర, రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని తీర్మానంలో పేర్కొవాలని వైఎస్ జగన్ సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement