దంపతులపై దాడి : కేసు నమోదు | youth attacks on couple in boduppal case filed | Sakshi
Sakshi News home page

దంపతులపై దాడి : కేసు నమోదు

Aug 22 2016 7:47 PM | Updated on Jul 10 2019 8:00 PM

దంపతులపై నలుగురు యువకులు అకారణంగా దాడి చేసి గాయపర్చిన సంఘటన మేడిపల్లి జరిగింది.

బోడుప్పల్: రోడ్డు పక్కన కారును అడ్డంగా పెట్టారనే కారణంతో దంపతులపై నలుగురు యువకులు అకారణంగా దాడి చేసి గాయపర్చిన సంఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం బోడుప్పల్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే సర్దార్ ఖాన్, నస్రిన్ కౌసర్ భార్య భర్తలు. ఆదివారం రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉండే మరిది ఇంటికి నస్రిన్ కౌసర్ వెళ్లింది. తరువాత ఆమె భర్త ఆమెను తీసుకెళ్లడం కోసం కారులో వచ్చాడు. కారును రోడ్డు పక్కన పెట్టి ఉండగా స్థానికంగా ఉండే నలుగురు యువకులు రోడ్డు పక్కన కారును ఎందుకు నిలిపారంటూ భార్య భర్తలు ఇద్దరిపై దాడి చేశారు. వారికి తీవ్ర గాయాలు కావడంతో ఉప్పల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వారి ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

Advertisement
 
Advertisement
Advertisement