
టవరెక్కి యువకుడి హల్‌చల్
తాగిన మైకంలో ఓ యువకుడు విద్యుత్ సరఫరా లేని టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు
పటాన్‌చెరు : తాగిన మైకంలో ఓ యువకుడు విద్యుత్ సరఫరా లేని టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. స్థానిక యువకులు చొరవ తీసుకుని అతణ్ణి కిందకు దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రెండు గంటల హైడ్రామాకు తెరపడింది. ఈ ఘటన ఆదివారం పటాన్‌చెరు పట్టణంలో జరిగింది. వివరాలు... తాండూరులోని సాయిపూర్‌కు చెందిన వడ్ల శ్రీనివాస్‌రెడి ్డ గత మూడేళ్లుగా రామచంద్రాపురం బండ్లగూడలో తన సోదరి లక్ష్మి వద్ద ఉంటున్నాడు.
తన బావతో గొడవపడి మద్యం తాగిన అతను ఆదివారం మధ్యాహ్నం పటాన్‌చెరు బస్టాండ్ సమీపంలోని విద్యుత్ సరఫరా లేని టవర్ ఎక్కాడు. దూకి చనిపోతానంటూ బెదిరించాడు. బస్టాండ్ ప్రాంతం కావడంతో ఘటన స్థలం వద్ద పెద్ద సంఖ్యలో జనం పోగయ్యారు. ఫైర్ సిబ్బంది తాళ్లతో పైకి ఎక్కేందుకు యత్నించారు. స్థానిక యువకులు కొందరు చొరవ తీసుకొని అతణ్ణి కిందకు దింపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
దీంతో రెండు గంటలపాటు సాగిన ఈ హైడ్రామాకు తెరపడింది. పోలీసులు శ్రీనివాస్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించి, అతనిపై కేసు నమోదు చేశారు. కాగా ఇంట్లో గొడవ పడిన శ్రీనివాస్‌రెడ్డి ఆత్మహత్యాయత్నం డ్రామాకు తెరతీశాడని అతని సోదరి లక్ష్మి తెలిపారు. అతని మానసిక స్థితి సరిగ్గా లేదన్నారు.