'మంచి సంప్రదాయం కాదు' | yanamala ramakrishnudu slams ysrcp | Sakshi
Sakshi News home page

'మంచి సంప్రదాయం కాదు'

Aug 31 2015 9:46 AM | Updated on Mar 23 2019 9:10 PM

'మంచి సంప్రదాయం కాదు' - Sakshi

'మంచి సంప్రదాయం కాదు'

శాససభలో విపక్ష వైఎస్సార్ సీపీ సమయం వృధా చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

హైదరాబాద్: శాససభలో విపక్ష వైఎస్సార్ సీపీ సమయం వృధా చేస్తోందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ప్రత్యేక హోదాపై తమ ప్రభుత్వం ప్రకటన చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారని తెలిపారు. సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు.

తాము స్టేట్ మెంట్ ఇవ్వబోతున్నామని తెలిసి కూడా ఈ విధంగా సమయాన్ని వృధా చేయడం సమంజసం కాదన్నారు. సభా సమయం వృధా చేసి సమావేశాల గడువు పెంచాలని కోరతారా అని ప్రశ్నించారు. చర్చకు స్పీకర్ అనుమతించిన తర్వాత మీ డిమాండ్లు అన్ని చెప్పాలని సూచించారు. పదే పదే సభను అడ్డుకోవడం సంప్రదాయం కాదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement