సింగపూర్ కేంద్రంగా ఉన్న ఎక్సీడ్ విద్యాశాఖ బోధనలో భాగంగా మరో రెండు కొత్త యాప్లను గురువారం ప్రవేశపెట్టింది.
హైదరాబాద్: సింగపూర్ కేంద్రంగా ఉన్న ఎక్సీడ్ విద్యాశాఖ బోధనలో భాగంగా మరో రెండు కొత్త యాప్లను గురువారం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో వాటి కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన అప్లికేషన్లకు ట్యాప్ అండ్ ఎక్సీడ్ ఫ్యూచర్ అని పేర్లు పెట్టారు. ట్యాప్ అనే యాప్ టీచర్ల నైపుణ్యాన్ని అంచనా వేసి వాటిని మరింత పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఎక్సీడ్ ఫ్యూచర్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లలో పనిచేయాలనుకునే ఔత్సాహిక టీచర్లకు ఉపయోగపడే ద్విభాషా యాప్ ఎక్సీడ్ ఫీచర్.
ఎక్సీడ్ వైస్ ప్రెసిడెంట్ అనుస్టప్ నాయక్ మాట్లాడుతూ.. నేటి విద్యావ్యవస్థలో నేర్చుకోవడమే ప్రధానాంశంగా మారిందన్నారు. పరీక్షల్లో ఏ విధంగా ఉత్తీర్ణత సాధించాలనే దానిపై విద్యార్థులకు సరైన అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఎక్సీడ్ విద్యావ్యవస్థకు సంబంధించి స్కూళ్లలో కేజీ నుంచి 8వ తరగతి వరకు బోధన ఉంటుంది. ప్రస్తుతం 1600 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయని.. వాటిని 10 వేలకు పెంచడమే లక్ష్యమన్నారు. అదే విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎక్సీడ్ విద్యావ్యవస్థను ప్రవేశపెడుతామని ఆయన అన్నారు. దేశ వ్యాప్తంగా 1600 స్కూళ్లలో 7 లక్షల 50 వేల మంది విద్యార్థులు ఉన్నారని.. అందులో 60 వేల మంది టీచర్లు ఉన్నట్లు నాయక్ తెలిపారు.