బోడుప్పల్లో యువతి అదృశ్యం | woman disappeared in boduppal | Sakshi
Sakshi News home page

బోడుప్పల్లో యువతి అదృశ్యం

Feb 19 2017 10:00 PM | Updated on Aug 11 2018 8:48 PM

ఉద్యోగానికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది.

బోడుప్పల్‌(హైదరాబాద్‌): ఉద్యోగానికి వెళ్లిన ఓ యువతి కనిపించకుండా పోయింది. ఆదివారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బోడుప్పల్‌ రాజీవ్‌నగర్‌కు చెందిన కె. స్వప్న(26) ప్రైవేట్‌ ఉద్యోగిని. ఈ నెల 15న ఆఫీసు వెళ్లి జీతం తీసుకుని వస్తానని చెప్పిన ఆమె.. తిరిగి ఇంటికి రాలేదు. ఎక్కడ వెతికినా కనిపించకపోవడంతో ఆదివారం వారి కుటుంబ సభ్యులు మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement