కుమార్తెలు మాట వినడం లేదని.. | Woman commits suicide | Sakshi
Sakshi News home page

కుమార్తెలు మాట వినడం లేదని..

Apr 19 2016 7:11 PM | Updated on Nov 6 2018 7:56 PM

ఇద్దరు కుమార్తెలతో గొడవపడిన ఓ తల్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.

బోడుప్పల్ (హైదరాబాద్) : ఇద్దరు కుమార్తెలతో గొడవపడిన ఓ తల్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ ఈదయ్యనగర్ కాలనీకి చెందిన ఆదిమూలం వీరయ్య, స్వప్న(27) భార్యాభర్తలు. వారికి దీక్షిక, శ్రామిక అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరయ్య లేబర్‌గా పని చేస్తుండేవాడు. భర్త వీరయ్య, ఇద్దరు పిల్లలతో గొడవ జరిగినప్పుడల్లా.. నా మాట వినకపోతే చనిపోతానని స్వప్న బెదిరించేది. 
 
ఈ క్రమంలో మంగళవారం ఇద్దరు పిల్లలు ఎండలో ఆడుకుంటుండగా ఇంట్లోకి రమ్మని వారిని బెదిరించింది. కాసేపు ఆడుకున్న తరువాత ఇంట్లోకి వస్తామని చెప్పిన వారు ఎండలో ఆడుకుంటున్నారు. దీంతో తన మాట వినడం లేదని మనస్తాపం చెందిన స్వప్న ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇది గమనించిన కుటుంబసభ్యులు మేడిపల్లి పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement