అవసరమైతే టీడీపీతో పొత్తు: గుత్తా | Will fight against trs party in 2019 elections, says gutta sukender reddy | Sakshi
Sakshi News home page

అవసరమైతే టీడీపీతో పొత్తు: గుత్తా

Nov 24 2015 11:33 AM | Updated on Sep 3 2017 12:57 PM

అవసరమైతే టీడీపీతో పొత్తు: గుత్తా

అవసరమైతే టీడీపీతో పొత్తు: గుత్తా

వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో స్పందించారు.

నల్గొండ : వరంగల్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంపై నల్గొండ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మంగళవారం నల్గొండలో స్పందించారు. అవినీతి, అధికార దుర్వినియోగంతోనే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తోందని ఆయన ఆరోపించారు.టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని గుత్తా ఈ సందర్భంగా అన్నారు.

వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటామన్నారు. అలాగే అవసరమైతే టీడీపీతో కూడా తమ పార్టీ పొత్తుకు సిద్ధమని కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్రెడ్డి స్పష్టం చేశారు. వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ దాదాపు మూడు లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండోవ స్థానంలో ఉండగా.... , బీజేపీ - టీడీపీ మాత్రం మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్రెడ్డిపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement