కాకరాల పద్మ ఎక్కడ? | Where is Kakarala Padma? | Sakshi
Sakshi News home page

కాకరాల పద్మ ఎక్కడ?

Jul 8 2017 2:08 AM | Updated on Mar 28 2019 5:32 PM

కాకరాల పద్మ ఎక్కడ? - Sakshi

కాకరాల పద్మ ఎక్కడ?

తమిళనాడులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న రెవల్యూషనరీ విమెన్‌ మూమెంట్‌ నాయకురాలు కాకరాల పద్మను కోర్టులో హాజరుపర్చాలన్న కేసులో

ఏపీ, తమిళనాడు పోలీసులకు హైకోర్టు నోటీసులు
 
సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడులో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న రెవల్యూషనరీ విమెన్‌ మూమెంట్‌ నాయకురాలు కాకరాల పద్మను కోర్టులో హాజరుపర్చాలన్న కేసులో పోలీసులకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది.  కౌంటర్‌ పిటిషన్లు వేయాలని ఏపీ, తమిళనాడుæ డీజీపీలు, ఏపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్‌ ఎంఎస్కే జైస్వాల్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

అనంతరం విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. తమిళనాడులోని చెన్నిమలై రైల్వేస్టేషన్‌లో ఏపీ పోలీసులు పద్మను అదుపులోకి తీసుకొని, ఆమెను ఏకోర్టులోనూ హాజరుపరచలేదని న్యాయవాది డి.సురేశ్‌కుమార్‌ హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌  వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement