'ఏపీకి లక్షా 93 వేలు.. తెలంగాణకు 84 వేలు' | Venkaiah naidu talks about release of houses to telugu states | Sakshi
Sakshi News home page

'ఏపీకి లక్షా 93 వేలు.. తెలంగాణకు 84 వేలు'

Aug 30 2016 4:26 PM | Updated on Oct 17 2018 4:13 PM

'ఏపీకి లక్షా 93 వేలు.. తెలంగాణకు 84 వేలు' - Sakshi

'ఏపీకి లక్షా 93 వేలు.. తెలంగాణకు 84 వేలు'

ఏపీకి లక్షా 93 వేలు, తెలంగాణకు 84 వేల ఇళ్లను మంజూరు చేసినట్టు వెంకయ్య నాయుడు తెలిపారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లక్షా 93 వేల ఇళ్లు, తెలంగాణ రాష్ట్రానికి 84 వేల ఇళ్లను మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తెలిపారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 9 లక్షల 35వేల ఇళ్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు.

పదేళ్ల యూపీఏ పాలనలో కేవలం పదిలక్షల ఇళ్లు మాత్రమే మంజూరు చేసినట్టు విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మారుస్తామని వెంకయ్య స్పష్టం చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement