గురువును మించిన శిశ్యుడు | Tutor beyond the .... | Sakshi
Sakshi News home page

గురువును మించిన శిశ్యుడు

Apr 10 2014 1:23 AM | Updated on Sep 2 2017 5:48 AM

బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్‌జీయూహెచ్‌ఎస్-2007) ప్రశ్నపత్రం లీకేజ్...

రాజగోపాలరెడ్డి కారు డ్రైవరే
‘పీజీఎంఈటీ-2014’ లీకువీరుడు


 బెంగళూరులోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైన్ (ఆర్‌జీయూహెచ్‌ఎస్-2007) ప్రశ్నపత్రం లీకేజ్... కన్సార్టియమ్ ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కొమెడ్ కే-2011) బోగస్ ప్రశ్నపత్రం లీకేజ్ కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజగోపాలరెడ్డికి డ్రైవర్‌గా పనిచేసిన వ్యక్తే విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్వహించిన పీజీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ (పీజీఎంఈటీ-2014) లీకేజ్‌లో సూత్రధారిగా సీఐడీ అధికారులు గుర్తించారు.

ఇతడే కర్ణాటకలోని ఉడిపి, దావణగెరెలకు చెందిన మరికొందరితో కలిసి ముఠా కట్టి వ్యవహారాన్ని నడిపినట్లు నిర్థారించారు. ఈ కేసు దర్యాప్తు పూర్తిచేసిన సీఐడీ ప్రత్యేక బృందాలు బుధవారం కీలక సూత్రధారులతో సహా ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. వీరిని గురువారం అరెస్టు చేసే అవకాశం ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement