అభివృద్ధిని విస్మరించి కాలయాపన | TRS Leaders fire on MLA Vamsi Chand | Sakshi
Sakshi News home page

అభివృద్ధిని విస్మరించి కాలయాపన

Aug 23 2017 1:46 AM | Updated on Sep 12 2017 12:46 AM

కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించకుండా అనవసర విషయాలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి కాలయాపన చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు.

ఎమ్మెల్యే వంశీచంద్‌పై టీఆర్‌ఎస్‌ నేతల ధ్వజం
సాక్షి, హైదరాబాద్‌:
కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆలోచించకుండా అనవసర విషయాలతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వంశీచంద్‌ రెడ్డి కాలయాపన చేస్తున్నారని టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టుపై చర్చ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు తోకముడిచారని వంశీ చేసిన విమర్శలను ఖండిస్తున్నట్లు చెప్పారు. సంస్కారంలేని వంశీతో మంత్రి చర్చకు ఎలా వస్తారని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే ఆళ్ల వెంకటేశ్వర్‌రెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో నీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్‌ ఇచ్చిన పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌కు హాజరుకాకుండా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తోకముడి చారన్నారు. కాంగ్రెస్‌ హయాంలో కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులో జూపల్లి అవినీతికి పాల్పడ్డారని వంశీ నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. అవినీతికి జూపల్లి పాల్పడి ఉంటే అప్పటి సీఎం, ఇరిగేషన్‌ మంత్రులు పొన్నాల, సుదర్శన్‌ రెడ్డి ఏం చేశారని నిలదీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement