'సర్వేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి' | TPCC secretary suresh yadav takes on sarve satyanarayana | Sakshi
Sakshi News home page

'సర్వేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి'

Jan 22 2016 1:27 PM | Updated on Sep 3 2017 4:07 PM

'సర్వేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి'

'సర్వేని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి'

టీ కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై టీపీసీసీ కార్యదర్శి సురేష్ యాదవ్ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు.

హైదరాబాద్ : టీ కాంగ్రెస్ పార్టీ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణపై పీసీసీ కార్యదర్శి సురేష్ యాదవ్ శుక్రవారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మల్కాజ్గిరిలోని గౌతంనగర్ డివిజన్ కార్పొరేటర్ టిక్కెట్ కోసం సర్వే సత్యనారాయణ తన వద్ద రూ. 26 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఆ డివిజన్ టికెట్ తనకు కాకుండా... సెటిలర్కు ఇచ్చారని విమర్శించారు. సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ అంశంపై శనివారం తాను న్యూఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవనున్నట్లు సురేష్ యాదవ్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement