టమోటా ధరకు రెక్కలు: కిలో రూ.80 | Tomato price rise | Sakshi
Sakshi News home page

టమోటా ధరకు రెక్కలు: కిలో రూ.80

Jun 6 2016 5:10 PM | Updated on Sep 4 2017 1:50 AM

టమోటా ధరకు రెక్కలు: కిలో రూ.80

టమోటా ధరకు రెక్కలు: కిలో రూ.80

టమోటా ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మెదక్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్ధితుల కారణంగా రబీలో సాగు చేసిన టమోటా తోటలు దెబ్బతిన్నాయి.

పటాన్‌చెరు టౌన్ (హైదరాబాద్) :

ఇప్పటికే మిర్చి ధరతో అల్లాడిపోతున్న వినియోగదారులకు ఇప్పుడు టమోటా తన దెబ్బ రుచి చూపిస్తోంది. టమోటా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఈ ఏడాది మెదక్ జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్ధితుల కారణంగా రబీలో సాగు చేసిన టమోటా తోటలు దెబ్బతిన్నాయి. దీంతో బహిరంగ మార్కెట్‌లో వీటి ధరలకు రెక్కలొచ్చాయి.

25 కేజీలు ఉన్న ఒక బాక్స్ ధర రూ.1200కు చిరువ్యాపారులు కొనుగోలు చేసి వినియోగదారులకు అమ్ముతున్నారు. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో టమోటా కిలో రూ. 80 పలుకుతోంది. కేవలం 15 రోజుల వ్యవధిలోనే కిలోకు రూ.50 వరకు ధరలు పెరగడంతో పేద, మధ్య తరగతి వినియెగదారులు ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement