స్వచ్ఛ హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖులు | tollywood actors partcipate in swachh hyderabad | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖులు

May 17 2015 5:28 PM | Updated on Aug 28 2018 4:30 PM

స్వచ్ఛ హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖులు - Sakshi

స్వచ్ఛ హైదరాబాద్లో టాలీవుడ్ ప్రముఖులు

సినీ నటులు తమ అభిమానులను స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కోరారు.

బంజారాహిల్స్ (హైదరాబాద్): సినీ నటులు తమ అభిమానులను స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనేలా ప్రోత్సహించాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కోరారు. ఆదివారం ఫిలింనగర్‌లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్వహించిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

తెలుగు సినీ పరిశ్రమను దేశంలోనే నంబర్‌వన్‌గా చేసే బాధ్యత తాను చేపడతానని తలసాని హామీ ఇచ్చారు. పరిసరాలను, రహదారులను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత స్థానికులదేనని అన్నారు. రూ.25 కోట్లతో మూడేళ్లలో రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ, మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్, సినీ హీరోలు వెంకటేష్, రానా, రాజశేఖర్, నటి రకూల్ ప్రీత్‌సింగ్, దర్శకులు కె. రాఘవేందర్‌రావు, త్రివిక్రమ్ శ్రీనివాస్, బోయపాటి శ్రీను, సురేందర్‌రెడ్డి, నటులు వేణుమాధవ్, తనికెళ్ల భరణి, విజయ్‌చందర్, హేమ, శివాజీరాజా, ఉత్తేజ్, నిర్మాత సి.కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement