ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి: గట్టు | The Telangana government should take urgent steps: Gattu srikanth Reddy | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి: గట్టు

Sep 22 2016 10:04 PM | Updated on May 29 2018 4:26 PM

ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి: గట్టు - Sakshi

ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలి: గట్టు

భారీ వర్షాలకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని గట్టు శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

హైదరాబాద్:రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వైఎస్సార్సీపీ తెలంగాణ అధ్యక్షులు గట్టు శ్రీకాంత్ రెడ్డి  ఆవేదన వ్యక్తం చేశారు. మహానగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగి చాలా మంది ఇంకా వరదల్లోనే చిక్కుకున్నారని అన్నారు. మరోవైపు వాతావరణ శాఖ మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో ప్రభుత్వం సత్వరమే సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ  తెలంగాణ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది

నల్లగొండ లోని దామరచర్ల, నిడమనూరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు అక్కడి ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు. అద్దంకి, నార్కట్ పల్లి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని వెంటనే సహాయక చర్యలు తీసుకోవాలని కోరారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న  ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిలంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement