ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన విద్య అవసరం | Sakshi
Sakshi News home page

ప్రాథమిక స్థాయిలోనే నాణ్యమైన విద్య అవసరం

Published Sun, Jul 17 2016 5:43 PM

The quality education need at basic level

ప్రాథమిక స్థాయి నుంచే మెరుగైన విద్యతో చిన్నారులను ప్రోత్సహించి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం ఛారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మ్యాడం జనార్థన్‌రావు అధ్యక్షతన ఆదివారం కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్రమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

]

ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్టడీ మెటీరియల్, స్కాలర్‌షిప్‌లను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ నైపుణ్యాలతో కూడిన విద్యతోనే విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోగలరని పేర్కొన్నారు. పేద ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్నూరుకాపు విద్యార్థి వసతి గృహం ట్రస్ట్‌బోర్డు సభ్యులు పుంజరి బద్రినారాయణ, ప్రొఫెసర్ మ్యాడం వెంకట్‌రావు, గంప చంద్రమోహన్, జెల్లి సిద్దయ్య, ఆకుల పాండురంగం, పి.విష్ణువర్ధన్, తెలంగాణ మున్నూరుకాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాశెట్టి ఆనంద్తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement
Advertisement