రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మద్దూరు గ్రామంలో ఓ బాలికకు తలపెట్టిన పెళ్లిన అధికారులు ఆపు చేయించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మద్దూరు గ్రామంలో ఓ బాలికకు తలపెట్టిన పెళ్లిన అధికారులు ఆపు చేయించారు. గ్రామానికి చెందిన నాగుల పెంటయ్య కూతురు(15)కు అదే గ్రామానికి చెందిన కప్పెర యాదయ్య కుమారుడు ప్రకాశ్‌కు ఇచ్చి వివాహం చేసేందుకు రెండు కుటుంబాల వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
దీనిపై స్థానికులు ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించారు. కాసేపట్లో పెళ్లి కానుండగా పోలీసులతోపాటు అధికారులు అక్కడికి చేరుకుని పెళ్లిని అడ్డుకున్నారు. బాలికను నగరంలోని చైల్డ్‌వెల్ఫేర్ ఆఫీసుకు తరలించారు. తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్‌ఐ రాజు, ఏఎస్‌ఐ శంకరయ్య పేర్కొన్నారు.