‘హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచడంపై అసంతృప్తి’ | Telangana Private Junior College association unhappy with inter board Decision | Sakshi
Sakshi News home page

‘హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచడంపై అసంతృప్తి’

Feb 27 2017 3:31 PM | Updated on Sep 5 2017 4:46 AM

‘హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచడంపై అసంతృప్తి’

‘హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచడంపై అసంతృప్తి’

ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచడంపై ప్రయివేట్‌ కళాశాలల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నాయి.

హైదరాబాద్‌ : ఇంటర్మీడియెట్‌ విద్యార్థుల హాల్‌టికెట్లు వెబ్‌సైట్‌లో ఉంచడంపై ప్రయివేట్‌ కళాశాలల యాజమాన్యాలు అసంతృప్తిగా ఉన్నాయి. ఫీజు కట్టకున్నా, హాజరు కాకపోయినా పరీక్ష రాయొచ్చనే విధంగా వ్యవహరించడం సరికాదని తెలంగాణ ప్రయివేట్‌ జూనియర్‌ కాలేజీ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నరేందర్‌ రెడ్డి అన్నారు. విద్యార్థులందరూ హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్ష రాస్తే, ఇక నాణ్యమైన విద్యతో పాటు, బయోమెట్రిక్‌ హాజరు ఎందుకని ఆయన సోమవారమిక్కడ ప్రశ్నించారు.

కాగా  ఫీజులు కట్టలేదనో మరే కారణంతోనైనా విద్యార్థులకు హాల్‌టికెట్లను ఇవ్వని యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకొంటామని ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే. అలాగే హాల్‌ టికెట్లకోసం ఇంటర్‌ విద్యార్థులు ఆందోళన చెందవద్దని, తెలంగాణ ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోచ్చని సూచించారు. మరోవైపు ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షలను మార్చి 1 నుంచి 19 వరకు జరగనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement